మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యువ క్రికెటర్

by Shyam |
Robinson
X

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్‌ గతంలో మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు, జాత్యాంహంకార వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. తొమ్మిది ఏళ్ల క్రితం ట్విట్టర్ వేదికగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఇతర మతాలు, ప్రాంతాల వారిని కించ పరుస్తూ పోస్టులు పెట్టాడు. అయితే న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసి ఆనందంలో ఉన్న రాబిన్‌సన్‌కు నెటిజన్లు ఊహించని షాక్ ఇచ్చారు. గతంలో తను చేసిన ట్వీట్లను వెలికి తీసి సోషల్ మీడియాలో ఉంచారు.

దీంతో అతడిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ‘తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు తెలిసీ తెలియక తప్పు చేశాను. అప్పట్లో నన్ను ఒక కౌంటీ జట్టు నుంచి తప్పించడంతో మానసిక స్థితి గతి తప్పింది. ఆ కోపంలో ఎన్నో ట్వీట్లు చేశాను. కానీ తర్వాత తాను మారి పోయాను. ఒక క్రికెటర్‌గా మారడానికి చాలా కష్టపడ్డాను. అప్పుడు చేసింది నిజంగా చాలా పెద్ద తప్పు. దయచేసి నన్ను క్షమించండి’ అని రాబిన్ సన్ వేడుకొన్నాడు. ఈ ట్వీట్ల వివాదంతో రాబిన్‌సన్‌ను రెండో టెస్టు నుంచి తప్పించే అవకాశం ఉన్నది. అంతే కాకుండా ఇకపై జట్టులోకి తీసుకునే యువ క్రికెటర్ల సోషల్ మీడియా హిస్టరీని కూడా పరిశీలించాని ఈసీబీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story