శంషాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు

by Shyam |
శంషాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు
X

దిశ, వెబ్‎డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడి బంగారం, సెల్‎ఫోన్లను దోచుకెళ్లారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్‎పల్లి గ్రామంలో అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. అలాగే పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంలను రప్పించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story