- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృత్యుదారులు.. చోద్యం చూస్తోన్న అధికారులు!
దిశ, భూపాలపల్లి: ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోడ్డు వెడల్పు పనులను చేపట్టింది. కానీ, గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టి నాణ్యత పాటించక తమ జేబులు నింపుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం జయశంకర్ భూపాలపల్లి జాతీయ రహదారి. ఈ రహదారిలో ప్రమాదం జరుగని రోజంటూ ఉండదని, సరిగ్గా నరకానికి మరో దారిలా ఉంటుందని స్థానికులు అంటున్నారు. 353 జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయింపోయింది. నిత్యం వందలాది లారీలు ఈ రోడ్డుమీదుగా వెళ్లడంతో దిగబడిపోయి చిన్న వాహనాలు ప్రయాణించడానికి వీలులేకుండా పోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పితే ప్రమాదాలు జరిగే అవకాశంగా మారింది. చిన్న చిన్న వాహనాలకు సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో భూపాలపల్లి జిల్లాలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై ఎన్నిమార్లు అధికారులకు విన్నవించుకున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అవుతుంది.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి కంటితుడుపు చర్యగా మైనింగ్ శాఖ వారుకొంత పరిహారం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇసుక క్వారీలు ప్రారంభమైనప్పటి నుండి ఈ రహదారిపై వందల సంఖ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రమాదాలు అరికట్టే విషయంలో రోడ్డు రవాణా సంస్థవారు, పోలీసులు సైతం తగు చర్యలు తీసుకోకకపోవడం గమనార్హం. ఇసుక క్వారీల ద్వారా అధికారులకు, నాయకులకు నెల నెలా ముడుపుల చెల్లింపులు జరుగుతుండడంతో భూపాలపల్లి కాళేశ్వరం నుండి రేగొండ వరకు జాతీయ రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. జాతీయ రహదారి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం విషయంలో తగు నాణ్యతను పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో రోడ్డు దిగబడిపోయి ప్రమాదాలకు నిలయంగా మారిందని వాదన ఉంది.
కాగా, ప్రమాదం జరిగిన ప్రతీసారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది తప్పా.. అధికారుల నుంచి చర్యలు మాత్రం శూన్యం. కేవలం ప్రాణాలకు పరిహారం చెల్లించి సరిపెట్టుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు, స్థానిక ప్రతిపక్ష నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం పోలీస్ అధికారులు రావడం, క్వారీ యజమానితో చర్చించి పరిహారం చెల్లించడం జరిగిపోతూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలకు మించకుండా పరిహారం చెల్లిస్తున్నారు. రాష్ట్రాల్లో అనేకచోట్ల ఇసుక క్వారీలు నడుస్తున్నప్పటికీ ఎక్కడా ఇటాంటి ప్రమాదాలు జరుగకపోవడం గమనార్హం. జిల్లాలోని మహదేవ్‌పూర్ కాళేశ్వరం ప్రాంతాల నుండి చేరవేసే ఇసుక లారీల వల్లనే ఇంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, క్వారీపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు, న్యాయం చేసి, రోడ్డు మరమ్మత్తులు చేయాలని వేడుకుంటున్నారు.