చస్తున్నా వదిలేశారు!

by Shyam |
చస్తున్నా వదిలేశారు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి మనుషుల్లోని మానవత్వాన్ని మరింత దిగజారేలా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో రోడ్డు పై ఓ వ్యక్తి కిందపడిపోయినా.. అతడి దగ్గరికి వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. అతడితో పాటు ఉన్న ఇద్దరు మహిళలు సాయం కోసం ఎంతగా ప్రాధేయపడినా..చుట్టూ ఉన్న వాళ్లు పట్టించుకోని పరిస్థితి. కరోనా కారణంగా సాటి మనిషిని తాకేందుకు ప్రజలు భయపడే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కొద్దిరోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న జవహర్ నగర్‌కు వాసి పృధ్వీరాజ్‌కు ఎంతకూ తగ్గడంలేదు. దీంతో అతడ్ని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.

అతన్ని ఆటోలో మరో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలోనూ అతడి పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈసీఐఎల్ దగ్గర అతడిని రోడ్డుపై దించాడు ఆటోడ్రైవర్. సాయం కోసం అతడితో వచ్చిన ఇద్దరు మహిళలు ఎదురుచూశారు. కొందరు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. అయితే, అతడు కరోనా కారణంగానే చనిపోయాడా లేక ఏదైనా ఇతర అనారోగ్యంతో కన్ను మూశాడా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed