కారు టైరు పగిలి లారీని ఢీకొట్టిన కారు చివరికి

by Sumithra |
కారు టైరు పగిలి లారీని ఢీకొట్టిన కారు చివరికి
X

దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండలకేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీసు ముందర NH44వ జాతీయ రహదారి పై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళుతున్న కారు టైరు పగలడంతో ఓ లారీకి ఢీకొట్టడంతో కారు డ్రైవర్ మారుతిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో వున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ ఐ గౌరేందర్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story