వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

by Anukaran |   ( Updated:2020-12-26 02:31:51.0  )
వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం మోమీన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, కూలీలతో వెళ్తున్న ఆటో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నితిన్, సోనాబాయి, సంజీవ్, శ్రీనిబాయి, రేణుకబాయిగా గుర్తించారు. ఆటోలోని కూలీలంగా చిట్టంపల్లి వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story