- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. అడవిలో అలా వెళ్తుండగా
దిశ, వాజేడు : చెట్టుకు టాటా మ్యాజిక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రం నుంచి మంగపేట మండలం కమలాపూర్‌కు ప్రయాణికులతో కూడిన టాటా మ్యాజిక్ వెళ్తుండగా మార్గం మధ్య అడవిలో అతివేగంగా గాలులు వీచడంతో రహదారిపై పెద్ద వృక్ష పడిపోయింది. దీంతో టాటా మ్యాజిక్ కూలిన చెట్లు తప్పించబోయి మరో చెట్టుకు ఢీకొట్టడంతో వాహనంలో కూర్చున్న ప్రయాణికుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతి చెందిన వ్యక్తి చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. రహదారికి అడ్డంగా పడివున్న చెట్టుని జేసీబీ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేశారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.