ఘోర రోడ్డు ప్రమాదం.. స్మగ్లర్లు సజీవ దహనం

by Anukaran |   ( Updated:2020-11-01 22:01:59.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. స్మగ్లర్లు సజీవ దహనం
X

దిశ, వెబ్‎డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోటూరు వద్ద టిప్పర్‌ను సుమో, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఓ సుమో వేగంగా వెళ్లి టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు కార్లు, టిప్పర్ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనం అయ్యారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story