అమ్రబాద్ అడవుల్లో.. ఫారెస్ట్ అధికారికి గాయాలు

by Shyam |
అమ్రబాద్ అడవుల్లో.. ఫారెస్ట్ అధికారికి గాయాలు
X

దిశ, నాగర్‌కర్నూలు: అడవి జంతువును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో జంతువులు మృత్యువాత పడగా ఫారెస్ట్ అధికారి గాయాల పాలయ్యారు. వివరాళ్లోకి వెళితే… నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామ సమీపంలోని పరహాబాద్ చౌరస్తా దగ్గర మన్ననూర్ నుంచి ఫారెస్ట్ అధికారి దోమలపెంట వైపు బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బషీర్ రోడ్డు దాటుతున్న క్రమంంలో జంతువు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డం వచ్చింది. దీంతో జంతువును వేగంగా ఢీ కొట్టడంతో అడవి జతువు మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. బైక్‌పై ఉన్న అధికారికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story