రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి

by srinivas |
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story