- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీహార్‌లో ఆర్జేడీ నేత దారుణ హత్య..
పాట్నా : బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఇవాళ ఓ ఆర్జేడీ నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని రవి యాదవ్‌గా గుర్తించామనీ.. ఇవాళ ఉదయం ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ”షేహారీ గ్రామానికి చెందిన రవి యాదవ్ ఆర్జేడీలో క్రియాశీలకంగా ఉన్నారు. బుధవారం రాత్రి ఓ ఫంక్షన్ కోసం బయల్దేరి వెళ్లిన ఆయన.. రాత్రి పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాలేదు. గురువారం ఉదయం గాధ్నీ సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది..” అని పోలీసులు వెల్లడించారు.
మృతుడి తలలో ఓ బుల్లెట్ దిగబడినట్టు గుర్తించారు. ముఖంపై గాయాలు ఉండటంతో దుండగులు ముందు ఆయనపై భౌతిక దాడి జరిపి, తర్వాత కాల్చి చంపినట్టు భావిస్తున్నారు. కాగా రవి యాదవ్ హత్యకు నిరసనగా స్థానికులు ఘాద్నీ సమీపంలోని ఆరా-పిరో-సాసరం రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలనీ.. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవి హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే రాజకీయ ప్రత్యర్థులే ఆయనను పొట్టనబెట్టుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.