- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ యూ పప్పా.. రితీష్ హార్ట్ బ్రేకింగ్ వీడియో
బాలీవుడ్ యాక్టర్ రితీష్ దేశ్‌ముఖ్ టిక్‌టాక్‌లో ఫుల్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నారు. భార్య జెనీలియాతో కలిసి పలు వీడియోలు చేసిన రితీష్.. ఇప్పటి వరకు ఎంటర్‌టైన్మెంట్‌తో అలరించారు. కానీ ఆయన తాజాగా చేసిన పోస్ట్ నెటిజన్లను ఎమోషనల్ అయ్యేలా చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకైన రితీష్.. తన తండ్రి 75వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన వీడియో కంటతడి పెట్టిస్తోంది.
‘నిన్ను ప్రతీరోజు, ప్రతీ క్షణం మిస్సవుతున్నా పప్పా..’ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ యాక్టర్.. డ్రెస్ హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తన తండ్రి దుస్తుల్లో చేయి పెట్టి.. తన తండ్రి ఓదార్చినట్లుగా తనను తానే ఓదార్చుకున్నాడు. ఆ డ్రెస్‌ను కౌగిలించుకుని తన తండ్రే ప్రేమతో హగ్ చేసుకున్నట్లు, తల నిమిరినట్లు, భుజంపై చెయ్యి వేసి భరోసానిచ్చినట్లు ఫీల్ అయ్యాడు. ‘మిస్ యూ పప్పా’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో అగ్నిపథ్ సినిమాలోని ‘అభి ముజ్ మే కహీ’ సాంగ్ ప్లే అవుతుండటం మరింత హార్ట్ టచింగ్‌గా ఉంది. దీనిపై బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ స్పందిస్తున్నారు.
https://www.instagram.com/p/CAoyyEHjogx/?utm_source=ig_web_copy_link
నాన్న ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ నీతో ఉంటాయంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ విషెస్ అందించగా.. తనకు మరింత బలం, మరింత ప్రేమ కలగాలని కిచ్చా సుదీప్, సందీప్ కిషన్, లక్ష్మీ ప్రసన్న కోరుకున్నారు. ‘ఆయన నిజమైన దేశభక్తుడని.. విజన్ ఉన్న నాయకుడని.. తన దయ, సహాయం చేసే గుణం ఎప్పటికీ స్మరించుబడుతుంది’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా అన్నారు. ఆయన కొడుకు రితీష్ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు.