భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

by Shamantha N |   ( Updated:2021-06-05 22:53:15.0  )
petrol
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్‌పై 31పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.03 ఉండగా డీజిల్ ధర రూ.85.95 ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.25 ఉండగా, డీజిల్ ధర రూ. 93.10 గా ఉంది. అలానే చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.47 ఉండగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 90.66గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.76ఉండగా డీజిల్ ధర రూ.93.70గా ఉంది. అలానే విశాఖ పట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 94.23గా ఉంది.

Hyderabad: Petrol prices inching closer to Rs 94 markPetrol Prices Today, May 30, 2021: Prices remain unchanged after touching Rs 100 in Mumbai, check rates in metro cities | Economy News | Zee News

Advertisement

Next Story

Most Viewed