- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
by Anukaran |
X
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్ట స్ధాయికి పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ఆల్‌టైం హైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగి మొదటిసారిగా రూ .50,026కు చేరింది. వెండి కూడా ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి రూ. 60,844కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికన్ డాలర్ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారనే అంచనాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో హాట్‌మెటల్స్‌కు డిమాండ్ పెంచాయి. అయితే, సురక్షిత రిటన్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.
Advertisement
Next Story