- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూరులో ఆరని చితిమంటలు.. 48 గంటల్లో 92 శవాలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విలయతాడవంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ఎంతో మంది కరోనాతో మృతి చెందుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ కరోనా కోరలు చాస్తోంది. ఎక్కడ చూసినా చితి మంటలు, కుటుంబ సభ్యుల రోదనలే. ఏ క్షణంలో ఎవరు చనిపోయారని వార్త వినాల్సి వస్తుందోనని గుంటూరు జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఇక శ్మశానల్లో కాలుతున్న చితులను చూస్తే కరోనా విశ్వరూపమేంటో తెలుస్తుంది. కరోనాకు ముందు గుంటూరులోని బొంగరాలబీడు శ్మశాన వాటికకు రోజుకు నాలుగు నుంచి ఐదు మృతదేహాలు వచ్చేవి. కానీ కరోనా విజృంభణతో రెండు రోజుల్లో 92 మృతదేహాలు వచ్చాయి. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 141 శవాలకు ఇక్కడ అంత్యక్రియలు చేశారు. కాగా, గుంటూరులోని మొత్తం 11 శ్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది. దీంతో అత్యక్రియలు విరామం లేకుండా చేయాల్సి వస్తుందని శ్మశాన వాటిక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.