- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిమ్స్ డైరెక్టర్ బదిలీ.. పొలిటికల్ ‘పంచే’నా..?
దిశ, అదిలాబాద్: రిమ్స్ డైరెక్టర్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. ముక్కు సూటిగా మాట్లాడే బలరాం నాయక్ బదిలీ వెనుక రాజకీయ హస్తం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ గా బలరాంనాయక్ విధులు చేపట్టినప్పటి నుంచి ఆయన ఎవరి మాట వినకపోయేదని సమాచారం. ఇటీవల రిమ్స్ ఆస్పత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్లను రోగులకు వేయడం అప్పట్లో రాష్ట్రంలోనే దుమారం లేపింది. అయితే, ఈ ఘటనపై విచారణ చేపట్టి స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కొంతమంది వైద్యులు రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్ నిర్లక్ష్యం కారణంగానే కాలం చెల్లిన ఇంజెక్షన్లను రోగులకు ఇచ్చారని రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.
అయితే, నేతలతో కూడా డైరెక్టర్‌కు విభేదాలు ఉండేవి. మే నెలలో కరోనా కట్టడిపై ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే, రిమ్స్ డైరెక్టర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వారి మధ్య విభేదాలు ఉన్నట్లు అందరికీ తెలిసేలా చేసింది. ఇదిలాఉంటే త్వరలో ప్రారంభం కానున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో సైతం కొందరు నేతలు డైరెక్టర్ పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. డైరెక్టర్ ఎవరి మాట వినకపోవడంతోనే రాజకీయ నాయకులు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పి బదిలీ చేయించారని పలు ఆరోపణలకు ఊతమిస్తూ ఉన్నది.