‘దళిత బంధు’ కోసం రిలే నిరాహార దీక్ష

by Sridhar Babu |   ( Updated:2021-08-12 07:47:31.0  )
dalit-bandhu 1
X

దిశ, పాలేరు: దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అది కూడా హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు 10 లక్షల రూపాయలు వర్తింపజేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతుబంధు లాగే షరతులు లేకుండా ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా దళిత బంధు ఉండాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ముదిగొండ తహశీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నూకల నాగేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉండేటి శ్రీనివాసరావు మాల, జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల లక్ష్మణ్ రావు మాల, ఖానపురం సర్పంచ్ మాలోజు ఉష గోవింద్, మండల అధ్యక్షులు జొన్నలగడ్డ మునేశ్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు కామాల రామనాధం మాల, మండల అధికార ప్రతినిధి యాండ్రాతి నాగరాజు మాదిగ, న్యాయ సలహదారులు పనీతి పాపారావు మాల, మండల సీనియర్ నాయకులు కట్టకూరి సురేష్ మాదిగ, గ్రామ అధ్యక్షులు యాండ్రాతి సైదులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed