- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ లాభం రూ .6,348 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారం బలహీనంగా మారడంతో 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర లాభం 39 శాతం తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో రూ. 10,362 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. గడిచిన మూడేళ్ల కాలంలో రిలయన్స్‌కు ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. మూడో త్రాఇమాసికం నుంచే గమనిస్తే మొత్తం 45 శాతం తగ్గిందని సంస్థ తెలిపింది.
చమురు సెగ..
కరోనా వినాశనం వల్ల ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దాదాపు అన్ని దేశాల లాక్‌డౌన్ డిమాండ్ పడిపోవడంతో రూ. 4,267 కోట్ల నష్టాలు వచ్చాయని వివరించింది. అయితే, రిలయన్స్ జియో ఫలితాలు సానుకూలంగా ఉండటంతో లాభాల క్షీణత తగ్గినట్టు పేర్కొంది. ఇక, కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ. 1,36,240 కోట్లని తెలిపింది. స్థూల రిఫైనరీ మార్జిన్ 8.9 డాలర్లుగా ఉందని, కరోనా వల్ల ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం వల్ల చమురు-గ్యాస్ వ్యాపారంలో రూ. 485 కోట్ల నష్టాలు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఇక, రిలయన్స్ రిటైల్ స్థూల లాభం రూ. 2,062 కోట్లతో 20 శాతం వృద్ధి సాధించినట్టు పేర్కొంది.
నికర లాభం 177 శాతం పెరిగింది…
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో ఆర్థిక ఫలితాలు ఊరటనిచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నాలుగవ త్రైమాసికంలో నికర లాభం రూ. 2,331 కోట్లతో ఏకంగా 177 శాతం పెరిగింది. టెలికాం రంగంలో అనిశ్చితి వల్ల వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు సైతం పెరగడంతో నికర లాభం అధిక స్థాయిలో పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ. 840 కోట్లని సంస్థ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ. 14,835 కోటని, మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీగా ఎదిగామని సంస్థ ప్రకటించింది. వినియోగదారుల సంఖ్య 26 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. వినియోగదారుల నుంచి సగటు రాబటి రూ. 130.6 అని, వారం క్రితం ఫేస్‌బుక్ సంస్థతో జరిగిన ఒప్పందంతో జియో విలువ రూ. 4.62 లక్షల కోట్లుగా ఉన్నట్టు సంస్థ అంచనాలను పేర్కొంది.
2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తం నికర లాభం రూ. 5,562 కోట్లతో 88 శాతం వృద్ధి సాధించినట్టు, కార్యకలాపాల ఆదాయం రూ. 54,316 కోట్లతో 34 శాతం వృద్ధి అని సంస్థ వివరించింది. అలాగే, 7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విభజించేందుకు రిలయన్స్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇటీవల ఈ విభాగంలోని 20 శాతం వాటాను సౌదె ఆరామ్‌కో సంస్థకు విక్రయించడానికి సిద్ధమైంది.
లక్ష్యం కన్నా ముందే…
ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీని 2021 కల్లా రుణ రహిత కంపెనీగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న ముఖే అంబానీ దాన్ని ముందే సాధించే అవకాశాలున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రూ. 1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ఇటీవల రూ. 53,125 కోట్ల రైట్స్ ఇష్యూకి తోడు, జియో విభాగంలో ఫేస్‌బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడి, ఇంధన రిటైల్ విభాగంలో బ్రిటీష్ పెట్రోలియం 49 శాతం వాటాను విక్రయించి రూ. 7,000 కోట్లను విక్రయించడంతో ముఖేశ్ లక్ష్యాన్ని ముందే సాధించవచ్చని తెలుస్తోంది. రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక కంపెనీలు, ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని రిలయన్స్ పేర్కొంది. మార్చి చివరి నాటికి రిలయన్స్ సంస్థ మొత్తం రుణ భారం రూ. 3,36,294 కోట్లుగా ఉందని, నగదు, నగదు సమానమైన నిల్వలు రూ. 1,75,259 కోట్లు ఉన్నాయి. నికర రుణ భారం రూ. 1,61,035 కోట్లని సంస్థ వెల్లడించింది.
Tags : Reliance Industries, q4 Results, corona effect, covid-19