- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వర్లు పనిచేయలే.. పోస్టాఫీసుల్లోనూ మొరాయిస్తున్న ఆర్ ఐసిటి మిషన్లు
దిశ, బయ్యారం: కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పాలన పారదర్శకత పేరుతో ఇతర పోస్టల్ పనులు నగదు బదిలీలు ఆన్ లైన్ ద్వారా అందించేందుకు మార్గదర్శకాలు చేశారు . గత పక్షం రోజులుగా మొబైల్ టవర్ సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయక పోవడంతో మండలంలోని 11 గ్రామ పంచాయితీల పరిధిలో పోస్టల్ బిఎల్ ఓలు ఆర్ ఐసిటి మిషన్లకు సిగ్నల్ లేక పోవడంతో ఆఫీసు పనులు సరిగాచేయలేక పోతున్నట్లు తెలిపారు. నిత్యం స్థానికులు ఆర్ డిలు, రిజేష్టేన్ పనులు ఇతర నగదు లావా దేవీలు ఆర్ ఐసిటి డివైజర్ మిషన్ ద్వారా అప్ లోడ్ చేయవల్సి ఉంది. అయితే వాటికి నెట్ వర్క్ సిగ్నల్స్ లేక పోస్టాఫీసుల బిఎల్ ఓలు ప్రతిరోజు సెల్ సిగ్నల్ వద్దకు వచ్చి ఆర్ ఐసిటి మిషన్ ద్వారా పనులు చేసుకోవల్సి వస్తోంది. దీనితో అనేక ఇబ్బందులు పడుతూ పోస్టల్ సేవలను కొనసాగించడం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలోని టవర్ పరిసర ప్రాంతాలలోనికి వచ్చినా సరిగా మొబైల్ సిగ్నల్ పనిచేయడం లేదని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి మొబైల్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్దరించాలని వేడుకుంటున్నారు.