రీల్ లైఫ్ పేజీని తొలగించింది అందుకే: రిచ

by Shyam |
రీల్ లైఫ్ పేజీని తొలగించింది అందుకే: రిచ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ చేసింది కొన్ని సినిమాలే అయినా, మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అమెరికా నుంచి వచ్చిన రిచ, తన కెరీర్‌లో కేవలం 9 సినిమాలు మాత్రమే చేసింది. ఎంబీఏ చేయడం కోసం తిరిగి అమెరికా వెళ్లిపోతున్నానని, అందుకోసం సినిమాలు ఇక చేయనని 2013 అక్టోబర్‌లో రిచానే స్వయంగా ప్రకటించింది. ఆ తర్వాత 2019లో జోయ్ లాంగెల్లాను వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. రిచా, ధనుష్‌తో కలిసి నటించిన సినిమా ‘మయక్కం ఎన్నా’. ఈ చిత్రం విడుదలై బుధవారానికి 9 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.

‘వావ్.. మయక్కం ఎన్నా చిత్రానికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకే రీల్ లైఫ్ అనే ఓ పేజీని రియల్ లైఫ్ నుంచి తొలగించాను. రీల్ లైఫ్ నుంచి నా కెరీర్‌ను మార్చుకున్నందుకు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఆ విషయంలోనే కాదు, అసలు నా జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి బాధల్లేవు. నటిగా ఉన్న సమయంలోనే మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్‌తో ప్రేమలో పడ్డాను. ఆ కోరికే నన్ను ఎంబీఏ చేసే దిశగా తీసుకెళ్లింది. ఫేమస్ మూవీ స్టార్‌గా కాకుండా, వేరే కోరికలు కూడా ఉండొచ్చు కదా? ఇది నమ్ముతారా నమ్మరా? ఎంబీఏ చేస్తున్న సమయంలోనే జోయ్‌తో పరిచయమైంది. చివరకు అతడినే పెళ్లి చేసుకున్నాను. సినిమాలను కొనసాగించాలన్నది గొప్ప ఆలోచనే కావచ్చు. కానీ, అంతకంటే మంచి ఆలోచనలు నన్ను ఆ రీల్ లైఫ్‌ను వదిలేలా చేశాయి. జీవితంలో ఎన్నో చాయిసెస్ ఉంటాయి. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. బీ ఓపెన్. మీ డ్రీమ్స్, గోల్స్ మిమ్మల్ని తీర్చుదిద్దుతాయి. 24 వయసులో ఉన్నప్పటి ఆలోచనలకు, ఇప్పుడున్న ఆలోచనలకు చాలా తేడా ఉంది. కానీ, నా జీవితమంటే నాకు చాలా ఇష్టం. నా సినిమాలు చూసినందుకు, నాపై అభిమానం ఉంచినందుకు థ్యాంక్యూ. మయక్కం ఎన్నా ఫ్యాన్స్ మీ అందరికీ చెబుతున్న విషయం ఏంటంటే.. నేను కార్తీక్ అండ్ జోయ్ నా యామిని’ అని రిచ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed