- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ ఓ ఇడియట్ : లీడర్ హీరోయిన్
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియక తల పట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. విదేశీ వీసాల రద్దు లాంటి నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో లీడర్, మిర్చి, మిరపకాయ్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ కూడా ట్రంప్‌ను చెడామడా కడిగేసింది. ట్రంప్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించిన ఆమె.. ట్రంప్ ఒక ఇడియట్ అని, భయంకర మానవుడు అని విమర్శించింది. ట్రంప్ ఫాలోవర్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపిన రిచా.. అమెరికాలో సెటిలై ఎందుకీ ఏడుపు? అన్న ఓ నెటిజన్‌కు గట్టిగానే సమాధానం ఇచ్చింది. 22 ఏళ్లుగా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని.. ఇక్కడే ఉంటానని చెప్పింది. భారతీయులు కలలుగన్న భవిష్యత్తు కోసం ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేసింది.