24 గంటల్లో ధాన్యం అన్‌లోడ్ చేయకుంటే రైస్‌మిల్ సీజ్

by Shyam |

దిశ, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో తీసుకువచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లో అన్‌లోడ్ చేయకపోతే సంబంధిత రైస్‌మిల్‌ను వెంటనే సీజ్ చేయాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం కంజర, ముల్లంగి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయం నుంచి అధికారులతో మొబైల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం రైస్‌మిల్‌కు చేరుకున్న 24 గంటల్లో అన్‌లోడ్ చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

tags: 24 hrs, if millers don’t unload rice, rice mill seaz, collector narayana reddy orders

Advertisement

Next Story

Most Viewed