ఇద్దరి ప్రాణం తీసిన వరి ధాన్యం.. తలలు పగులగొట్టిన టిప్పర్!

by Sumithra |
ఇద్దరి ప్రాణం తీసిన వరి ధాన్యం.. తలలు పగులగొట్టిన టిప్పర్!
X

దిశ, గీసుగొండ : వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. వారి మీద నుంచి టిప్పర్ వెళ్లడంతో స్పాట్ డెడ్ అయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం.. నీరుకుళ్ల గ్రామానికి చెందిన సిరిమెల్ల శివప్రసాద్( 57) ఉద్యోగ రీత్యా హన్మకొండ సుబేదారి ప్రాంతంలోని జులై వాడలో స్థిరపడ్డారు.

తన సమీప బంధువు హన్మకొండ గుడిబండల ప్రాంతానికి చెందిన సంపత్ అభినవ్ (14)తో కలిసి ద్విచక్ర వాహనంపై దుగ్గొండి మండలం నీరుకుల్ల గ్రామానికి పని నిమిత్తం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మొగిలిచర్ల గ్రామం మీదుగా వరంగల్ వెళ్తున్నారు.ఈ క్రమంలోనే మొగిలిచర్ల గ్రామ శివారులోని రైస్ మిల్లు ప్రాంతంలో టిప్పర్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డుపై వరి ధాన్యం ఆరబోసి ఉండటాన్ని గమనించలేదు. అందులో నుంచి బైక్ వెళ్లగా అదుపుతప్పి టిప్పర్ చక్రాల కింద పడటంతో ఇద్దరి తలల మీద నుంచి వాహనం వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ ఘటనపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో రోడ్లపై వరి ధాన్యం, మొక్కజొన్న విచ్చలవిడిగా ఆరబోయడం వల్లనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని దయచేసి అధికారులు స్పందించి మున్ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story