ఆర్జీవీ ‘మర్డర్’పై విచారణ వాయిదా

by Anukaran |   ( Updated:2020-08-19 08:56:25.0  )
ఆర్జీవీ ‘మర్డర్’పై విచారణ వాయిదా
X

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం ‘మర్డర్’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. అమృత ప్రణయ్, మారుతీ రావు మధ్య బంధం ప్రధానాంశంగా తీసుకుని సినిమా చేస్తున్న వర్మ.. ఈ మధ్య పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. కానీ తను అమృత కథ సినిమాగా మలచడం లేదని, ఆ సంఘటనలు బేస్ చేసుకుని మాత్రమే సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.

కానీ అమృత మాత్రం.. తన కథే సినిమా కథ అంటూ కోర్టుకు వెళ్లింది. మర్డర్ చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు, తీర్పును ఈ నెల 24కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed