RGV Tweet : ఈ నా.. కొడుకు.. అల్లు అరవింద్ కొడుకు..

by Shyam |   ( Updated:2021-05-22 23:56:03.0  )
RGV Tweet : ఈ నా.. కొడుకు.. అల్లు అరవింద్ కొడుకు..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టే ట్వీట్లకు నెట్టింట్లో చాలా డిమాండ్ ఉంది. కొంతమంది నిర్మొహమాటంగా వర్మ ఏమనుకొంటే అదే చెప్తాడు అని అంటుంటే.. ఇంకొంతమంది ఆ ట్వీట్లకు అర్ధం పర్థం ఏమైనా ఉందా అంటూ తిట్టిపోస్తున్నారు. ఘాటు పదజాలంతో వర్మ పెట్టె ట్వీట్లు ఎప్పుడు హాట్ టాపికే. తాజాగా ఈ కాంట్రవర్సీ కింగ్ మరో కాంట్రవర్సీ ట్వీట్ ని ట్విట్టర్ లో వదిలాడు. ఇక ఈసారి అల్లువారబ్బాయిని టార్గెట్ గా మార్చాడు. ఇటీవల అల్లు శిరీష్ తన సిక్స్ బ్యాక్ బాడీని చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లందరు శిరీష్ మేకోవర్ ని చూసి ముక్కున వేలేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగపరుచుకొని కండలు పెంచిన ఈ కుర్ర హీరో ఫోటోపై రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు.

https://twitter.com/RGVzoomin/status/1396176896472219651?s=20

ట్విట్టర్ లో శిరీష్ ఫోటోను షేర్ చేస్తూ “ఈ నా.. కొడుకు .. కొనాన్ ది బార్బేరియన్ .. ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కొడుకు కాదు? అల్లు అరవింద్ కొడుకు.. అల్లు సార్ మీ .. కి జోహార్!!” అంటూ ఘాటైన పదజాలంనే ఉపయోగించాడు. అయితే ప్రస్తుతం శిరీష్ ని వర్మ.. తిట్టాడా..? పొగిడాడా..? అనేది నెటిజన్ల డౌట్. అయితే ఎక్కువమంది నెటిజన్లు మాత్రం ఘాటైన పదజాలం ఉపయోగించినా ..వర్మ ఈ కుర్రహీరోని పొగిడాడనే అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై అల్లువారి ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

Advertisement

Next Story