ఆర్జీవీని గాంధీ తో పోలుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే ?

by Anukaran |   ( Updated:2021-09-13 05:11:28.0  )
rgv
X

దిశ, సినిమా : వివాదాల వర్మ రోజురోజుకు బోల్డ్‌గా తయారవుతున్నాడు. ఆయన చెప్పేది ప్రాక్టికల్ గానే ఉన్నా వినేందుకు, అర్థం చేసుకునేందుకు ఇంకాస్త మెచ్యూరిటీ అవసరం అనిపిస్తుంది. ఇదే విషయాన్ని ‘ఆర్జీవీ బోల్డ్ విత్ అరియానా’ ఇంటర్వ్యూలోనూ చెప్పిన వర్మ.. మళ్లీ అదే టాపిక్‌తో బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డితోనూ మరో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో అరియానా, అషూ ఇద్దరితో ఉన్న ఫొటోను షేర్ చేసిన వర్మ.. మరింత మంది యంగ్ ఉమెన్ వీరిద్దరి కన్నా బోల్డ్ అండ్ హానెస్ట్‌గా చేంజ్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఈ ఫొటోలో వారి ఫేస్, తన షూస్ చూడటం మరిచిపోవద్దని చెప్పాడు. వారి హానెస్ట్ అండ్ సిన్సియారిటీకి సలామ్ చెప్తున్నట్లు దండాలు కూడా పెట్టాడు. కాగా ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆర్జీవీని గాంధీతో పోలుస్తున్నారు. మహాత్మాగాంధీకి ఆభా, మను సహాయకులుగా ఉన్నట్లే ఇక్కడ అరియానా, అషూ ఆర్జీవీకి సహాయకులుగా ఉన్నారని సెటైర్స్, బ్యాడ్ కామెంట్స్ చేశారు.

 RGV Ariyana  Ashu Reddi

https://www.facebook.com/Dishacinema

https://twitter.com/RGVzoomin/status/1437113818459508737?s=20

Advertisement

Next Story