- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పలువురు పోలీస్ సిబ్బందికి రివార్డులు
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా విభాగాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ అంజనీకుమార్ సోమవారం రివార్డులను అందజేశారు. సిటీ పోలీస్ విభాగంలో 2016లో ప్రారంభమైన కేపీఐ (కీ ఫర్మామెన్స్ ఇండికేటర్స్ )ను ప్రవేశపెట్టారు. పోలీస్‌స్టేషన్‌లలో ప్రతినెలా 17విభాగాల్లో పనిచేసే సిబ్బంది మెరుగైన పనితీరును గుర్తించేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. అందులో భాగంగా ఉత్తమ సిబ్బందిగా ఎంపికైన వారికి రివార్డు, ప్రశంసలతో ప్రోత్సహించారు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్ స్టాఫ్, పెట్రోల్ స్టాఫ్, కోర్ట్ వర్క్ స్టాఫ్, వారెంట్ స్టాఫ్, సమన్స్ స్టాఫ్, టెక్ టీమ్ స్టాఫ్, ఎస్ఐ, డిఎస్ఐ, క్రైమ్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, సెక్షన్ ఇన్‌చార్జ్, జనరల్ డ్యూటీ స్టాఫ్, డీఐఎస్, పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు తదితర సిబ్బంది డ్యూటీల్లో వృత్తి నైపుణ్యాలను గుర్తించడం లాంటి అంశాలున్నాయి. ఈ సందర్భంగా 2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు ఉత్తమ పనితీరుతో ఎంపికైన సిబ్బందికి సీపీ అంజనీకుమార్ ప్రశంసా పత్రాలను, రివార్డులను అందజేశారు.