అక్రమ నిర్మాణాలకు అండగా కేటీఆర్ ? రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్

by Shyam |
mp revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి అండతోనే ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా? లేక దీనిలో మీకూ భాగస్వామ్యముందా అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ విమర్శించారు. దీనిపై స్పందించాలంటూ.. తెలంగాణ సీఎంవో, జీహెచ్ఎంసీ కమిషనర్ ను ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story