పనుల్లో వేగం పెంచాలి

by Shyam |
పనుల్లో వేగం పెంచాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో నెమ్మదించిన పనులను వేగవంతం చేయాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లో అమలు అవుతున్న వివిధ పథకాలు, జరుగుతున్న పనులపై సోమవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కాలంలో చాలావరకు ముఖ్యమైన పనులు నెమ్మదించాయని, ప్రస్తుతం కరోనా పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కట్డడి చేస్తోందన్నారు. కాబట్టి అధికారులు కూడా ఆయా పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఉపాధిహామీ అనుసంధానించిన పనులను వేగిరం చేయాలని సూచించారు.

పల్లె ప్రగతి, హరితహారం, నిరంతర పారిశుద్ధ్యం వంటి పధకాలు కొనసాగించాలని పేర్కొన్నారు. రైతు వేదికలు, కల్లాలు, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వైకుంఠ దామాలు, డంపు యార్డులు, ప్రకృతి వనాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని కూడా మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లాల వారీగా ఆయా పనుల తీరు తెన్నులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Next Story