- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్‌రెడ్డిని చేతకాని మంత్రి అన్న రేవంత్ !
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. కొద్దినెలలుగా కిషన్‌రెడ్డి టార్గెట్‌గా మీడియాలో కామెంట్లు చేస్తున్న రేవంత్.. ఇప్పుడు ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ లేవనెత్తుతున్న అంశాలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డికి తెలిసినా.. అవకాశం, హోదా, బలాన్ని ఉపయోగించుకోవడం లేదని రేవంత్ సంధిస్తున్న ప్రశ్నలు.. నిజమే కదా అన్న అంశాలు పాలిటిక్స్‌లో పరుగులు పెడుతున్నాయి. వీటన్నింటికి తోడు అసలు కిషన్‌రెడ్డికి ఎందుకు చేతకావట్లేదని రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపేలా కనపడుతున్నాయి.
హైదరాబాద్‌లో వరద సాయం అసలు బాధితులకు అందడం లేదని గగ్గోలు పెడుతున్న బీజేపీ నేతలు.. కేంద్రంతో చెప్పి ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదని సోమవారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘నేను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా చెబుతున్నా.. ప్రభుత్వం ప్రకటించిన రూ.500కోట్ల సాయంలో రూ.250కోట్లు మాత్రమే పంచి.. మిగతా రూ.250కోట్లను టీఆర్ఎస్ కార్యకర్తలు దిగమింగారు. దీనిపై నేను ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నా’నని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పగలు తిట్టుకొని, రాత్రిళ్లు కలిసి ఉంటారని ఆరోపణ చేశారు. కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి దగ్గరే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ఉంటుందని.. ఇంత ఆరోపణలు చేస్తున్న మీరు ఎందుకు సీబీఐ విచారణ జరిపించట్లేదన్నారు.
తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని కొద్దిరోజులుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. అసలు ఫోన్‌ట్యాపింగ్ అంశం హోంశాఖ పరిధిలోకే వస్తుందని, ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి తెలియక అంటున్నాడా లేక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయాన్ని మరిచిపోయాడా అని రేవంత్ విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ మధ్య రచ్చ విషయంలో కిషన్‌రెడ్డి కల్పించుకొని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నా.. ఆయన ఎందుకు నోరు మెదపలేదన్నారు. కేవలం టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తున్నట్లుగా బయటకు నటించినా లోపల మాత్రం అంతా ఒక్కటేనన్నారు.
అయితే.. పైన రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలే కాక ఆరునెలల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరిగిన మత ఘర్షణల విషయంలోనూ కిషన్‌రెడ్డి నామ్‌కే వాస్తుగా వ్యవహరించారని, చర్యలు తీసుకునే అధికారం ఉన్నా పట్టించుకోనట్లు ఉన్నారన్న ఆరోపణలు వినిపించాయి. దీనితో పాటు ఇటీవల హైదరాబాద్ నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం తనతో అధికారులను పంపించలేదని.. కలెక్టర్‌పై గరం గరం అయిన కిషన్‌రెడ్డి తీసుకున్న చర్యలు శూన్యమన్న ప్రచారం జరిగింది. అంతేగాక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొద్దిరోజుల క్రితం సచివాలయంలో 250ఏళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ దేవాలయాన్ని కూల్చితే కిషన్‌రెడ్డితో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం సైలెంట్‌గా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. పైన పేర్కొన్న అన్ని అంశాలపై కిషన్‌రెడ్డికి చర్యలు తీసుకునే అధికారం ఉన్నా ఏమీ చేయలేక, నిస్తేజంగా ఉంటున్నారని, అసలు ఆయనకు ఏం చేతకావడం లేదన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి ప్రధానంగా వినపడుతున్నాయి.