- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌కు భారీ మద్దతు.. ‘బాహుబలి’ రేంజ్‌లో ప్రమాణ స్వీకారం
దిశ, మణుగూరు : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల మణుగూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలమూరి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మండల కేంద్రంలోని ఆయన ఇంట్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల7వ తేదీన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
ఐఎన్‌టీయూసీ నాయకులు వెలగపల్లి జాన్ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రేవంతన్న ప్రమాణ స్వీకారానికి ఐఎన్‌టీయూసీ యూనియన్ తరఫున సుమారు రెండు వేల మంది నాయకులు తరలి రావడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ద్వారా ఐఎన్‌టీయూసీ యూనియన్ బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మాజీ పట్టణ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కురం రవి మాట్లడుతూ.. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈనెల 7వ తేదీన ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాలు, పార్టీ అనుబంధ సంఘాలు, ఐఎన్‌టీయూసీ నాయకులు తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి నియామకం పట్ల యువజన కాంగ్రెస్ నాయకులు చాలా జోష్ మీద ఉన్నారని తెలిపారు. మంచి డైనమిక్ లీడర్.. రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇదే జోష్‌తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన వెన్నంటే ఉంటామన్నారు. ఆయన ప్రతీ పోరాటంలో మేమందరం భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలను ఎండగడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.