బ్రేకింగ్.. కొండా సురేఖ ఇంటికి రేవంత్ రెడ్డి

by Ramesh Goud |   ( Updated:2021-06-30 06:54:10.0  )
revanth reddy-konda surekha latest
X

దిశ ప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్‌లోని మాజీ మంత్రి కొండా దంపతుల అతిథి గృహానికి బుధవారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మర్యాద పూర్వకంగా వారిని కలవడానికి రేవంత్ వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మంగళ హారతితో స్వాగతం పలికారు కొండా సురేఖ. అనంతరం పుష్ప గుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

revanth-reddy,-konda-surekh

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. దొర గడీల పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పని చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకువచ్చి పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడేందుకు ప్రతీ కార్యకర్త అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

konda-surekha

revanth-reddy

కొండా దంపతులకు కీ రోల్… రేవంత్ ప్లాన్ అదేనా..?

Advertisement

Next Story

Most Viewed