- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ నువ్వు నా వెంట్రుకతో సమానం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : కేటీఆర్ నీకు బాధ్యత లేదా. మనందరి పిల్లలు చదువుతున్న విద్యాసంస్థల్లో ఈ మహమ్మారి విస్తరిస్తుంటే.. వీటిపై లోతైన విచారణ జరపాల్సిన బాధ్యత మీపై లేదా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలకు అలుముకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ వద్దకు రావాలని రేవంత్ రెడ్డి.. కేటీఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి వైట్ చాలెంజ్ విసిరారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్.. నా రాజకీయ చరిత్రలో నువ్వు నా వెంట్రుకతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వనగరానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో 12-14 ఏళ్లు ఉన్న పిల్లలు కూడా స్కూళ్లలో, కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. పబ్‌లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిపై స్పందించకుండా.. ఎదురుదాడి చేస్తూ, నాపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు.
అమర వీరుల స్థూపం ముందుకు ఎప్పుడొచ్చినా కేటీఆర్, నా.. నీ తల్లి దండ్రులు, తాత, ముత్తాతల చరిత్ర చెప్పుకుందామని అన్నారు. అంతేకానీ.. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ యువకులకు ప్రజా ప్రతినిధులుగా ఆదర్శంగా, పారదర్శకంగా ఉందాం.. టెస్టు చేసుకొని యువతకు విశ్వాసాన్ని కల్పిద్దామని పిలుపునిస్తే.. నాపై ఆరోపణలు చేయడం సరికాదు. కేటీఆర్ వెంట్రుకలు, రక్తం ఇస్తా అన్నప్పుడు.. నేను వెనకేస్తే యువతకు అనుమానాలు వ్యక్తమవుతాయని.. నేను రమ్మని పిలిచి ఇద్దరికి వైట్ చాలెంజ్ ఇచ్చానని తెలిపారు.
మేము పరీక్ష చేయించుకొని.. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మళ్లీ.. మరో ఇద్దరికి చాలెంజ్ విసిరి ఆదర్శంగా ఉందామని.. అందుకే మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి రావాలని పిలుపినిచ్చానని, దానికి ఎందుకీ డొంక తిరుగుడు మాట్లాడటం, బెదిరించడం’’ అని అన్నారు.
అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో అధికంగా మద్యాన్ని అమ్మడం, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండటంతోనే సైదాబాద్‌లో హత్యాచారం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌ను ప్రతీ ఒక్కరూ తమ వంతుగా తీసుకొని, తమ సహచరులకు చాలెంజ్ చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా చాలెంజ్‌ను స్వీకరిస్తే ఆయన స్థాయి మరింత పెరిగేది. మా స్థాయి వేరు అని రాజకీయాల్లో మాట్లాడొద్దు. ఎన్నికల్లో నిలబడే ప్రతీ లీడర్ డ్రగ్స్ టెస్టు చేసుకోవాలి. డ్రగ్స్ టెస్టు చేసుకున్న తర్వాతే రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వైట్ చాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు.
ప్రగతి భవన్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. టెన్షన్ లో కేసీఆర్!
- Tags
- drugs case
- ktr