- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాఫియాగా కేసీఆర్ ఫ్యామిలీ.. కోకాపేట భూములపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమ్మిన భూ అమ్మకాల వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లింది. ఈ భూముల్లో సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమాలకు పాల్పడిందని ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీబీఐకి గురువారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఆధారాలను సీబీఐకి అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోకాపేట, ఖానామేట్ భూముల అమ్మకాల్లో ఒక మాఫియా తయారైందని, సీఎం కుటుంబ సభ్యులే ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఇప్పుడు ల్యాండ్ మాఫియాను నడిపిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కోకాపేటలో తక్కువ ధరకు భూముల కొన్న ఐదు సంస్థలను వదలబోమని హెచ్చరించారు. దీనికి సంబంధించిన లెక్కా, పత్రాలు అన్నీ ఆధారాలతో ఉన్నాయని, సమగ్ర విచారణ చేయాలంటూ సీబీఐని కోరారు. అక్రమంగా కొల్లగొట్టిన భూములను తిరిగి గుంజుకుని, వేలం వేస్తామని, కోకాపేట భూముల అమ్మకంలో దోపిడీని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. మై హోం రామేశ్వర్రావుతో పాటుగా సీఎస్ సోమేశ్‌కుమార్, సీనియర్ ఐఏఎస్‌లు జయేశ్ రంజన్, అర్వింద్ కుమారులు ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నారని, సీఎం కాళ్లు మొక్కుతూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్‌పుష్ప పేరుతో భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు సీబీఐకి అందించిన నివేదికలో పేర్కొన్నారు.
కోకాపేట భూముల అమ్మకాలకు రాష్ట్రంలో ఈ ప్రొక్యూర్మెంట్ సంస్థ ఉండగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎ్సపీసీ ద్వారా టెండర్లు పిలవాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. టెండర్లలో ఎవరెవరు బిడ్లు దాఖలు చేశారు? వారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. టెండర్లలో పాల్గొనే సంస్థల సమర్థతను టెక్నికల్ బిడ్లలో చూడకపోతే దావూద్ఇబ్రహీం వంటి వారూ భూములు కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. ఎంఎస్పీసీ ద్వారా టెండర్లు వేయడంలో కుట్ర దాగి ఉందని, గతంలో దీనిపై కాగ్ సైతం అగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
కోకాపేట, ఖానామేట్‌లో తక్కు ధరలకు అమ్మిన భూములన్నీ కేసీఆర్ బినామీలు, సన్నిహితులు, బంధువులే సొంతం చేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ ప్రదేశంలో ఎకరం 50 కోట్లకు మించి ఉండేదని, అందరూ టెండర్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఈ యాక్షన్‌లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయని, రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నారని, సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ పుష్ప 7 ఎకరాలు కొనుగోలు చేసిందని, ఆక్వాస్పెస్ సంస్థ రూ. 390 కోట్లు, రాజపుష్ప సంస్థ రూ.138 కోట్లు లాభం గడించాయయని, రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. ప్రెస్టీజి సంస్థకు మంత్రి కేటీఆర్‌కు దగ్గర సంబంధాలు ఉన్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్- కేటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారని, 50 ఎకరాలు ఉన్న భూమి ఎకరానికో రేటు ఎలా ఉంటుందని, ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు, మిగిలిన 48 ఎకరాలు రూ.30 నుంచి రూ.40 కోట్లకు ఎలా ధర పలుకుతుందని ప్రశ్నించారు. సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారని, టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోమని హెచ్చరించారని, టీఆర్ఎస్- కేసీఆర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారన్నారు.
ప్రస్తుతం అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల లూటీ జరిగిందని, గతంలో లిక్కర్ మాఫియా లాగా.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపిందన్నారు. రూ.60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని, స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలవాలని, రాజ పుష్ప సంస్థ నిబంధనల విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుందని, తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్‌కు లేదని, భూ అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామని ప్రకటనలు చేసిన బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.