- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉదాసీనతతో శనగ పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేదని, అందువల్ల దళారుల గుప్పిట్లోకి మార్కెట్ వెళ్లిందన్నారు. శనగకు కనీస మద్దతు ధర రూ.5,100 ఉందని, కానీ సర్కార్ మార్కెట్ పై పర్యవేక్షణ చేయకపోవడంతో రైతులు అగ్గువకు పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. శనగ రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణమే దృష్టి పెట్టాలన్నారు. మద్దతు ధరకు రూపాయి కూడా తగ్గకుండా.. మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన పంటను కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మోడీ మెప్పు కోసమేనా..?
దేశమంతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని, రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చట్టాల అమలుకు సుముఖంగా లేవన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వ్యవసాయ చట్టాల అమలుపై మోడీ కన్న అత్యత్సాహం ప్రదర్శిస్తుండడంలో ఉన్న అంతర్యమేంటో చెప్పాలన్నారు. ప్రధాని మోడీ మెప్పు పొందేందుకే, రాష్ట్ర రైతుల ప్రయోజనాల తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై సర్కార్ స్పందించకపోతే రైతు ఉద్యమాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.