మంత్రి మల్లారెడ్డికి ఘోర అవమానం.. పరువు తీసేసిన బుడ్డోడు (వీడియో)

by Anukaran |   ( Updated:2023-12-16 17:03:02.0  )
minister malla reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటిస్తూ సీఎం, మంత్రి మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన మంత్రి మల్లారెడ్డి ప్రెస్‌మీట్‌లో బుధవారం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో దూషించాడు. అయితే, మల్లారెడ్డి వ్యాఖ్యలను రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఖండించారు. దీనికి నిరసనగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టారు. అయితే, రేవంత్ అభిమానులు వారి ఫేస్‌బుక్ అకౌంట్‌లో మల్లారెడ్డి చిత్రపటంపై పిల్లాడు మూత్రం పోస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన నేతను మరోసారి తిడితే సహించబోమని హెచ్చరించారు.

Advertisement

Next Story