ప్రశాంత్ కిషోర్‌ అంశాన్ని బయటపెట్టిన రేవంత్

by Shyam |   ( Updated:2021-07-07 05:17:18.0  )
ప్రశాంత్ కిషోర్‌ అంశాన్ని బయటపెట్టిన రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకోవాలని చాలామంది సలహాలు ఇస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. తమకు పీకేలు అవసరం లేదని, తమ కార్యకర్తలే మాకు పీకేలని తెలిపారు. ప్రతికార్యకర్త ఒక పీకేలా పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారని రేవంత్ తెలిపారు. ఏకెల్లాంటి కార్యకర్తలుండగా… పీకె ఎందుకు..? అని ప్రశ్నించారు. పీకే తమకు అవసరం లేదని రేవంత్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed