నెక్ట్స్ సీఎంగా రేవంత్ రెడ్డే.. ఆ సర్వేలో ప్రజల ఓటు ఆయనకే!

by Anukaran |   ( Updated:2021-11-12 07:27:39.0  )
Revanth Reddy LIVE
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నిక వేడితో సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పట్టేందుకు రంగంలోకి దిగాయి. ‘గ్రౌండ్ రిపోర్ట్’ అనే సంస్థ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి నుంచి నాలుగు వేల మంది ఓటర్లను ఇంటర్వ్యూలు చేసినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు సీఎం అభ్యర్థిపై వేర్వేరుగా ప్రశ్నించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్ల నాడిని తెలుసుకొని ‘గ్రౌండ్ రిపోర్ట్’ సర్వే ఫలితాలను వెల్లడించింది.

సర్వే ఫలితాల ఆధారంగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికార టీఆర్ఎస్ పార్టీకి 65-70(6- MIM) సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 35-40, బీజేపీ 12-14, ఇతరులు 0-1 గా ఫలితాలు రానున్నాయి. అయితే, సీఎం అభ్యర్థిపై ఫలితాలు మాత్రం వీటికి భిన్నంగా వచ్చాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని 44 శాతం మంది ఓట్లు వేసినట్లు సర్వేలో తేలింది. తర్వాత సీఎం కేసీఆర్‌కు 42శాతం, బండి సంజయ్‌కు 6-7 శాతం మంది ఓటు వేశారు. అయితే, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల మార్పులతో ప్రజల నాడి మారే అవకాశం లేకపోలేదు.

కేసీఆర్ నాకు నరకం చూపించారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Personal Loans: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్.. నెలకి రూ.5 లక్షలకి ఎంత EMI? వివరాలివే

Advertisement

Next Story