- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా సిమెంట్స్‌లో ప్రధాన వాటాదారుగా దమానీ!
న్యూఢిల్లీ: డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సౌత్ ఇండియాలో పేరు గడించిన ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇండియా సిమెంట్స్‌ను ఈయన పూర్తిగా స్వాధీనం చేసుకునే వ్యూహంలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా సిమెంట్స్ నియంత్రణ వాటాదారు ఎన్. శ్రీనివాసన్‌తో రాధాకిషన్ దమానీ అనధికారికంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటా ఉంది. పెట్టుబడిదారులను అన్వేషిస్తున్న క్రమంలో స్నేహపూర్వక నిర్వహణ మార్పుకు దమానీ హామీ ఇచ్చినట్టు సమాచారం. కానీ, బయట ప్రచారం జరుగుతున్నట్టు కంపెనీని స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. ఈ కంపెనీలో దమానీ కుటుంబసభ్యుల వాటా ఇటీవల 19.89 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇండియా సిమెంట్స్ షేర్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇండియా సిమెంట్స్ షేర్ విలువ పెరుగుతోంది. గతేడాది డిసెంబర్ సమయానికి రాధాకిషన్ దమానీ వాటా ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం పొందారు. అప్పటినుంచి ఇప్పటికీ 10.29 శాతానికి పెరిగింది. రాధాకిషన్ సోదరుడు గోపీకిషన్ దమానీకి 8.26 శాతం వాటా కలిగి ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మూడవ త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ రూ. 5.4 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. అమ్మకాలు సైతం రూ. 1,191 కోట్లకు తగ్గాయి. చివరి త్రైమాసికం ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ నెల 24న జరిగే బోర్డు సమావేశంలో ఫలితాలు ప్రకటించనున్నట్టు సమాచారం.