ప్రకృతిని గౌరవిద్దాం..

by Anukaran |   ( Updated:2020-07-28 03:37:29.0  )
ప్రకృతిని గౌరవిద్దాం..
X

‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’.. ప్రకృతి పట్ల మనుషులకు ఉండాల్సిన గౌరవం, ప్రేమ, ఇందుకోసం మనం నిర్వర్తించాల్సిన విధుల గురించి చర్చించుకునే రోజు. ప్రకృతితో మనకున్న అనుబంధం, సహజ వనరులను కాపాడుకునేందుకు మనం చేసే ప్రయత్నం, అవసరాన్ని గుర్తు చేసే రోజు. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రకృతితో సహజీవనం ఎలా చేయాలో? ప్రతిన పూనే రోజు. మరి ఇలాంటి రోజున సెలబ్రిటీలు ఇస్తున్న సందేశం ఏంటో చూద్దాం.

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతిన పూనుదామని పిలుపునిచ్చారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని సూచించారు. ‘నీటిని ఆదా చేయడం.. రీసైకిల్ చేయడం.. వ్యర్థాల నుంచి ప్రపంచానికి ఉపయోగపడే కొత్త శక్తిని అందించడం.. పునరుత్పాదక శక్తిని వినియోగించడం.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం’ నేర్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ప్రకృతిని పరిరక్షించడం, రక్షించడం గుర్తుంచుకోవాలని కోరారు.

‘ప్రకృతిని మనం గౌరవిస్తే.. ప్రకృతి మాత మనల్ని గౌరవిస్తుంది’ అన్నారు అనుష్క శర్మ. ఆరోగ్యకరమైన వాతావరణం.. స్థిరమైన, ఉత్పాదక సమాజానికి పునాది వేస్తుందన్న అనుష్క.. మనుషులతో పాటు ఇతర జంతువులు, జీవ జాతుల ఉనికి ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉందన్నారు. అలాంటప్పుడు మానవులుగా ప్రకృతి పరిరక్షణ వైపు అడుగులు వేయడం ఉత్తమమని చెప్పిన ఈ బాలీవుడ్ హీరోయిన్.. సహజవనరులను రక్షించడానికి, పరిరక్షించడానికి ప్రయత్నించాలని కోరారు. మనం సమిష్టిగా తీసుకునే చిన్న చిన్న చర్యలు భారీగా ప్రభావవంతం చూపిస్తాయన్న అనుష్క.. భూమి అందంగా ఉందని, ఎప్పటికీ అలాగే ఉండనిద్దామని కోరారు.

https://www.instagram.com/p/CDLMBtmpMUI/?igshid=r8tovkd9n0yk

మొక్కలను నాటుతూ ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని పెంచుకుందామని పిలుపునిచ్చారు దియా మీర్జా. మన జీవితం, ఆరోగ్యం, శాంతి, పురోగతి అన్నీ కూడా ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మన సహజ వనరులను కాపాడుకుందామన్న దియా.. సహజ ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అందరికీ వందనం అని తెలిపింది.

https://www.instagram.com/p/CDLSbWHjByu/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story