- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాండింగ్ కమిటి సమావేశంలో తీర్మానాలు
దిశ, హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిది ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్‌తో పాటు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సీసీపీ దేవేందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ జియా ఉద్దీన్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను పరిశీలిస్తే..
పైలెట్ ప్రాజెక్ట్ కింద నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో శానిటేషన్ నిర్వహిస్తున్న మేసర్స్ ఇక్సోరా కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సేవలను రెండు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
మాదాపూర్‌లో టీ జంక్షన్ అభివృద్ధి పనులకు, క్యూ సిటీ నుంచి వయా మైహోం విహంగా ద్వారా నియాబ్ వరకు స్లిప్ రోడ్ నిర్మాణానికి అవసరమైన ఆస్తులను సేకరించడానికి ఆమోదించారు.
ప్యాకేజి నెం.2 కింద శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ లోని నిర్దేశిత చెరువులలో గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయించారు.
రూ.59.86కోట్ల వ్యయంతో.. 221 జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణను మూడేండ్ల పాటు ఇవ్వడానికి, కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్ సిస్టం, 98 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి కమిటీ ఆమోదించింది.
మల్కాజ్‌గిరి సర్కిల్లో భరత్ నగర్ నుంచి ప్రగతి నగర్ వరకు, ఆర్టీసీ కాలనీ నుంచి మౌలాలి వార్డు నెంబర్ 138 వరకు రూ.2.10కోట్లతో ఆర్సీసీ డ్రెయిన్ నిర్మించాలని తీర్మానం జరిగింది. స్వీపింగ్ యంత్రాల సేవలను ఆగష్టు 14 కొనసాగించాలని నిర్ణయించారు.