యూకే వేరియంట్ ఫస్ట్ ఇమేజ్ విడుదల

by Anukaran |   ( Updated:2021-05-04 06:21:38.0  )
యూకే వేరియంట్ ఫస్ట్ ఇమేజ్ విడుదల
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణమైన యూకే వేరియంట్‌(బీ.1.1.7) తొలి చిత్రాన్ని పరిశోధకులు ప్రచురించారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు దీనిని గుర్తించారు. వైరస్ స్పైక్ ప్రొటీన్(దేహంలోని అవయవాలను అంటిపెట్టుకుని ఉండే వైరస్ కొమ్ములు) మరింత పటిష్టంగా మారినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. భారత్, కెనడా సహా అనేక దేశాల్లో కేసులు భారీగా పెరగడానికి యూకే వేరియంట్ ఒక కారణంగా ఉన్నది. ఈ వేరియంట్ కొమ్ముల్లో ఎన్501వై మ్యుటేషన్ సంభవించిందని బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరాం సుబ్రమణియన్ వివరించారు. యూకే వేరియంట్‌లో కొమ్ముభాగాన జరిగిన ఏకైక మ్యుటేషన్ ఇదేననీ తెలిపారు. అయితే, ఈ వేరియంట్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఎదుర్కోగలవని పేర్కొన్నారు. బ్రెజిల్ వేరియంట్(పీ.1), సౌత్ ఆఫ్రికా వేరియంట్(బీ.1.427/బీ.1.429), ఇండియన్ (బీ.1.617)లపైనా పరిశోధనలు జరుపుతున్నట్టు వివరించారు. ప్రస్తుత చికిత్స విధానాలు కొత్తగా వెలుగులోకి వస్తున్న వేరియంట్‌లను ఎదుర్కోగలవా? లేదా? తెలుసుకోవడం అత్యవసరమైన సమాచారమని, అందుకోసం తమ పరిశోధనలు కొనసాగిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed