- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ అంజనీకుమార్‌ను కలిసి టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గోవులను హత్య చేస్తే ఎనిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూవులకు గోవు చాలా పవిత్రమైందన్నారు. బక్రీదు పండుగ పురస్కరించుకుని గోవధ నిషేద చట్టం అమలు చేయాలన్నారు.
ప్రగతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొదటిగా గోమాతనే తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఆవులను వధించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ రెండు మూడు రోజుల్లో అనేక ఆవులను వధించడానికి నగరానికి తీసుకొచ్చినట్లు సమాచారం ఉన్నట్టు తెలిపారు. బక్రీద్ పండుగ రోజు ఆవులను వధించకుండా సమావేశం ఏర్పాటు చేసి సందేశం ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి శివకుమార్ విజ్ఞప్తి చేశారు.