- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్ ఆర్డర్లలో భారీ వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ పరిశ్రమ ఆర్డర్లు 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెరుగుతున్న ఆర్డర్లు గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే స్థూల వస్తువుల విలువలో 50 శాతం వృద్ధిని సాధించినట్టు యూనికామర్స్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత ఏడాది ప్రారంభంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న తర్వాత పండుగ సీజన్‌లో వినియోగదారులు మునుపటి కంటే అధికంగా కొనుగోళ్లు జరిపారు. ఇదివరకటి కంటే భిన్నంగా షాపింగ్ చేయడంపై వినియోగదారులు దృష్టి సారిస్తున్నారని నివేదిక తెలిపింది.
ముఖ్యంగా వ్యక్తిగత అవసరాలకు వినియోగించే ఉత్పత్తులు, తక్కువ ధరలో లభించే ఉత్పత్తుల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేశారని నివేదిక పేర్కొంది. ‘పండుగ సీజన్ ఈ-కామర్స్ పరిశ్రమకు ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన సమయం. కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈ-కామర్స్ రంగం మెరుగైన అమ్మకాలను నిర్వహించింది’ అని యూనికామర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కపిల్ ముఖిజా చెప్పారు. ఈ పండుగ సీజన్ అంచనాలకు మించి పెరుగుతుంది. వ్యక్తి సంరక్షణ, పరిశుబ్రత, సంరక్షణ వంటి ఉత్పత్తుల విభాగాలు వృద్ధికి దోహదపడతాయని’ కపిల్ పేర్కొన్నారు.