అద్దె కట్టనివాడు.. మూడు రాజధానులు కడుతారా..?

by srinivas |   ( Updated:2020-09-08 02:53:25.0  )
అద్దె కట్టనివాడు.. మూడు రాజధానులు కడుతారా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించడం చేతకానీ ఏపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కట్టే సీనుందా అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగన్ సర్కార్ ఫెయిల్యూర్స్ పై ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అనంతపురంలో వార్డు సచివాలయ భవనాలకు ప్రభుత్వం అద్దె కట్టలేదని యజమానులు తాళాలు వేసి, ఉద్యోగులను రోడ్డు మీదకు నెట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ విమర్శించారు. పాలన చేతకాకపోతే మూలన కూర్చోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు లేకపోతే వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నిలువునా అమ్మేసేవారన్నారు.

ప్రభుత్వానికి అసలు 3 రాజధానుల సలహా ఇచ్చింది ఎవరు..? సీఎం జగన్‌కు బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఇలా మూడు చోట్ల 3 ఇళ్ళు ఉన్నాయని.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా..? అని అనగాని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలు ఏడిస్తే ఇంటికి, అన్నదాతలు ఏడిస్తే దేశానికి మంచిది కాదంటారు, కానీ వైసీపీ పాలనలో వీరు ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నారని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక రాజధానులపేరుతో అమరావతి రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది భవిష్యత్ బాగుకోసం భూములిచ్చిన రైతులు, మహిళలు నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం బాధాకరమని ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed