- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేణులో రెండు కోణాలు
పూరీ జగన్నాథ్ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతోనే రేణుదేశాయ్.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రేణు, పవన్‌ల ప్రేమ, పెళ్లితో పాటు 2011లో పవన్‌తో విడాకుల విషయమూ విదితమే. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో పాటు పుణెలో ఉంటున్న రేణు.. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. కానీ, ఆ తర్వాత ఈ విషయమై సైలెంట్ అయిపోయింది. అయితే, తను ఎక్కడున్నా.. ఎప్పటికప్పుడు తన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే రేణు.. తాజాగా తనలో రెండు కోణాలున్నాయని చెబుతోంది.
మోడర్న్ లుక్‌లో.. ఈ తరం అమ్మాయిలా తయారైన లుక్ ఓ వైపు, ఒక యోగిలా ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తున్న లుక్ మరోవైపు.. ఆ రెండు భిన్నమైన కోణాలను అభిమానులకు వెల్లడిస్తూ ‘నేను రెండు విధాలా ఉండగలను’ అని ఫొటోలను షేర్ చేసింది రేణుదేశాయ్. ‘నా వృత్తి, వ్యక్తిగత జీవితం రెండూ ఒకేసారి సాగుతాయి. నా గ్లామర్ ప్రపంచంతో పాటు యోగా, మెడిటేషన్, వెగాన్‌గా ఉండటం, సాత్విక జీవితం గడపడం.. ఇవన్నీ నా జీవన విధానంలో భాగం. అయితే వేటికవే భిన్నమైనవి, ఒకదానితో మరొకదాన్ని మిక్స్ చేయను. ట్రెడిషనల్, మోడర్న్ అనే భిన్న కోణాల మధ్య వారధిగా నిలుస్తున్న సద్గురుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా’ అంటోంది రేణు. పవన్ కల్యాణ్‌కు దూరమైన తర్వాత రేణు తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించారు. దర్శకురాలిగా, రచయితగా బిజీగా ఉన్నారు. త్వరలోనే రైతు సమస్యలపై ఓ సినిమా చేస్తుందని ఇది వరకు ప్రకటించింది కూడా.