మీకు మీరుగా గుర్తింపు పొందాలి : రేణు

by Shyam |
మీకు మీరుగా గుర్తింపు పొందాలి : రేణు
X

రేణు దేశాయ్.. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ పేజీని రాసుకుందామని ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ఆమె.. తర్వాత కెరియర్ కంటిన్యూ చేయలేకపోయింది. రేణు దేశాయ్ కన్నా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగానే మిగిలిపోయింది. ఆ తర్వాత తన నుంచి విడిపోయిన రేణు.. ఒంటరిగా పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నా, అవమానాలు మాత్రం ఎదుర్కొంటూనే ఉంది.

కాగా మహిళలకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది రేణు. ఒకరి కుతూరుగానో, ఒకరి భార్య గానో కాకుండా మీకు మీరుగా జీవించాలని సూచించింది. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉందని.. మీ సామర్థ్యంపై నమ్మకంతో ముందుకు సాగాలని సూచించింది. ‘చాలా మంది దృష్టిలో నేనొక సింగిల్ పేరెంట్. పురుష ప్రపంచంలో నాకే నేనుగా ఎదుగుతున్న వ్యక్తిని. సమాజపు కట్టుబాట్లను నిరాకరిస్తూ.. పితృస్వామ్య వ్యవస్థను వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతూ.. నా కాళ్ల మీద నేను నిలబడ్డాను’ అని చెప్పింది. కానీ సమాజం మాత్రం తనను ఒక మొండిదానిగా నెగెటివ్‌గానే చూస్తుందని తెలిపింది రేణు.

‘స్త్రీ వాదం అంటే సంప్రదాయ విలువలను అగౌరవపరచడం కాదని.. సంప్రదాయాల ముసుగులో మహిళలు అన్యాయానికి గురికాకుండా నిలబడటం’ అని తెలిపింది. మహిళలు తమ శక్తిపై పూర్తి నమ్మకంతో ఉండాలని.. దుర్గా మాత, లక్ష్మీ దేవి.. సరస్వతి దేవిలో ఉన్న మూడు లక్షణాలతో మరింత బలంగా ఎదగాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed