ఉద్యోగులకు శుభవార్త తెలిపిన రెనాల్ట్ ఇండియా!

by Harish |
ఉద్యోగులకు శుభవార్త తెలిపిన రెనాల్ట్ ఇండియా!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభంతో నష్టాలను ఎదుర్కొంటున్న కంపెనీలు ఉద్యోగాల కోత, వేతనాలను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని కంపెనీలు ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి కూడా. ఈ జాబితాలోకి కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా సైతం చేరింది. కరోనా వైరస్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు అండగా ఉంటామని, వేతనాలను పెంచుతామని, ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా తమ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపటానికే అని రెనాల్ట్ ఇండియా పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 250 మంది ఉద్యోగులకు 15 శాతం వరకూ వేతన పెంపు అమలు చేస్తామని వెల్లడించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 మందికి ప్రమోషన్లు కూడా ఇస్తామని స్పష్టం చేసింది. అయితే, వేతనాల పెంపుదలలో రెనాల్ట్ ఇండియాకు భాగస్వామ్య కంపెనీలైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాకు వర్తించదని పేర్కొంది. రానున్న పండుగ సీజన్‌లో ఎస్‌యూవీ అమ్మకాలు పెరగొచ్చని కంపెనీ భావిస్తోంది. కంపెనీ అభివృద్ధికి పాటుపడే ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని అందించనున్నట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story