- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ భాయ్ దేవదూత: లిజెల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఏబీసీడీ’ దర్శకుడు రెమో డిసౌజ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రెమో గుండెపోటుకు గురైన సమయంలో అతడి భార్య లిజెల్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఆమెకు బాసటగా నిలబడి, మానసిక స్థైర్యాన్ని నింపారట. ఈ విషయాన్ని లిజెల్ ఇన్ స్టా వేదికగా తెలుపుతూ..కష్టకాలంలో తనకు కొండంత అండనిచ్చిన సల్మాన్ భాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేశారు.
రెమో కోలుకోవడమే తనకు దక్కిన బెస్ట్ క్రిస్మస్ గిఫ్టని తెలపింది లిజెల్. వారం రోజులుగా అత్యంత దారుణమైన క్షణాలు గడిపిన తనకు రెమోను హత్తుకోవడం ఎంతో బాగుందని చెప్పింది. తన భర్త ఆస్పత్రిలో ఉన్న సమయంలో మానసిక ధైర్యాన్ని నూరిపోసిన సల్మాన్ భాయ్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సల్లూ భాయ్ ఒక దేవదూతలాగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నందుకు థాంక్స్ చెప్పింది. రెమో కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపింది. చలో ఇక మనం ఇప్పుడు క్రిస్మస్ సంబురాలు మొదలుపెడదామని అంది. కొరియోగ్రాఫర్ రెమో..డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరించారు.