విచ్చల‌విడిగా విక్రయాలు.. బ్లాక్ మార్కెట్‌లో రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు

by Sridhar Babu |
Remdesivir injections
X

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా.. కొంద‌రు మాన‌త్వం మ‌రిచి రాక్షాసుల్లా వ్యవ‌హ‌రిస్తున్నారు. క‌రోనా రోగుల‌ను ప్రాణాల నుంచి కాపాడేందుకు ఉప‌యోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొర‌త‌గా సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా వైర‌స్ పంజా విసురుతున్న త‌రుణంలో చాలామంది కోవిడ్ బారిన ప‌డ్డారు. ఇదే అదునుగా భావించిన కొంద‌రు ముఠాగా ఏర్పడి రెమిడిసివిర్ ఇంజ‌క్షన్లల‌ను విచ్చల‌విడిగా అధిక ధ‌ర‌లో విక్రయిస్తున్నారు. ఖ‌మ్మం న‌గ‌రంలో కొంత మంది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తులు రెమిడిసివిర్ ఇంజ‌క్షన్లను హైదారాబాద్ నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌లో విక్రయాలు చేస్తున్నారు. ఖ‌మ్మం న‌గ‌రంలో ఉన్ని ప్రైవేట్ హాస్పిట‌ల్ యాజ‌మానులు ఇంజ‌క్షన్లల‌ను భారీగా దిగుమ‌తులు చేసుకొని పేషంట్ కండిష‌న్ను బ‌ట్టి అధిక ధ‌ర‌లు విక్రయాలు చేస్తున్నారు. గ‌త వారం రోజుల పాటు ఈ దందా విచ్చల‌విడిగా కొన‌సాగుతుంది. ఒక్కొక్క ఇంజ‌క్షన్లల‌ను రూ.38 వేల నుంచి రూ. 40 వేల వ‌ర‌కు క‌రోనా షేషెంట్‌ల‌కు అంట‌గ‌డుతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ దందాపై అధికారులు దృష్టిసారించ‌క‌పోవ‌డంతోప‌లే అనుమానాల‌కు తావిస్తోంది.

ఖ‌మ్మంలో ముఠాలుగా ఏర్పాడి విక్రయాలు

క‌రోనా సెకండ్ వేవ్ కొంద‌రు కేటుగాళ్లకు కాలం క‌లిసొచ్చింది. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తులు కరోనా రెండో సెకండ్ వేవ్‌ను అస‌రాగా తీసుకొని రెమిడిసివిర్ ఇంజ‌క్షన్లల‌ను హైదారాబాద్‌లోని మెడిక‌ల్ డిస్ట్రిబ్యూట‌ర్లతో మిలాక‌త్ చేసుకొని భారీగా స్టాక్‌ను జిల్లాలో దిగుమ‌తి చేసిన్నట్లు స‌మాచారం. ఈ ముఠా స‌భ్యులు కొంత మంది ఏజెంట్లను నియ‌మించుకొని భ‌య‌ట మార్కెటింగ్ చేస్తున్నారు. ఎవ‌రికైతే అవ‌స‌రం ప‌డుతందో వారి ఫోన్‌లో సంప్రదిస్తే వారి ఏజెంట్ల ద్వారా ఆస్పత్రి వద్దను పంపిస్తున్నారు. అస‌లు ఈ ఇంజ‌క్షన్ బయ‌ట రూ.3400 ఉంటే వాటిని డిమాండ్‌ను బ‌ట్టి రూ.38 వేల నుంచి రూ.40 వేల అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప‌ని చేస్తే కొంత మంది కాంపౌండ‌ర్‌లు, పీఆర్‌వోలు హైదారాబాద్‌లోని ప‌లు ముఠా స‌భ్యల‌కు ఫోన్‌లు చేసి ఇంజక్షన్లులు ఆర్టీసీ బ‌స్సుల ద్వారా తెప్పిస్తున్నారు. హైదారాబాద్ నుంచి ఖ‌మ్మంకు నాలుగు గంట‌లో ఇంజ‌క్షన్ల చేరుతున్నాయి. ఖమ్మంలో ఎక్కడ చూసిన రెమిడిసివిర్ గురించే చ‌ర్చ న‌డుస్తోంది. షేషంట్ కండిష‌న్ల బ‌ట్టి అద‌రంగా కావాలంటే అడ్వాన్సు చెల్లించాల్సిందే.. లేదంటే ఇంజ‌క్షన్లు దొర‌క‌వ‌ని బెదిరిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్సత్రి నుంచి బ‌య‌టికి వ‌స్తున్న ఇంజక్షన్లు

క‌రోనా వైరస్ పుణ్యమా అని బ్లాక్ ముఠాగాళ్లకు, ప్రభుత్వ ఆస్సత్రి వైద్యుల‌కు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇంజ‌క్షన్లలు భ‌య‌ట మార్కెట్‌లో వ‌స్తున్నట్ల స‌మాచారం. ఖ‌మ్మం న‌గ‌రంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వ హాస్పట‌ల్‌తో సంబంధాలు ఉన్నాయి. వారి ప్రైవేట్ ఆస్పత్రి ఉన్న పేషంట్‌ల‌కు ఇంజ‌క్షన్లలు అవ‌సరం ఉంటే వారి బంధువుల‌కు చెబుతున్నారు. వారి బ‌య‌ట మార్కెట్‌లో ఇంజ‌క్షన్లు దోర‌క‌పోతే వారే తెపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న కొందురు సిబ్బంది ఇంజ‌క్షన్లను బ‌య‌ట‌కు త‌రిలిస్తున్నర‌ని తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా క‌లెక్టర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఇలాంటి రెమిడిసివిర్ ఇంజ‌క్షన్ల దందాపై దృష్టి సారించి కొరత సృష్టిస్తున్నవారిపై భ‌ర‌తం ప‌ట్టాల‌ని ప్రజానీకం కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed